నక్కపల్లి, జిల్లావాణి
మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లి లోని వైసిపి క్యాంపు కార్యాలయం లో నక్కపల్లి కి చెందిన మాజీ ఎంపిటిసి సభ్యురాలు జనపరెడ్డి శేషా రత్నం, ఆమె కుమార్తె శ్రావణి తో కలిసి మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా శేషారత్నం మాట్లాడుతూ జగనన్న నన్ను శేషమ్మ అక్క బాగున్నావా అంటూ ఎంతో ఆత్మీయతతో పలకరించారని పాయకరావుపేట నియోజకవర్గం వర్గం లో వైసిపికి మహిళలు ఎంతో అండగా ఉన్నారని వారి చూపించే ప్రేమ ఎప్పటికి మరువలేనిదని అన్నారన్నారు.గత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర లో నేను కలిసిన సందర్భం ఆయన ఇప్పటికి గుర్తు పెట్టుకుని అడగడం ఎంతో సంతోషం గా ఉందని అన్నారు.రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేసి పార్టీ బలోపేతానికి పని చేయాలని సూచించారన్నారు.
తాడేపల్లి లో వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలసిన శేషా రత్నం
RELATED ARTICLES
