Thursday, April 16, 2026
HomeUncategorizedకాగిత గ్రామంలో నూతన పార్కు ఏర్పాటు

కాగిత గ్రామంలో నూతన పార్కు ఏర్పాటు

నక్కపల్లి, జిల్లావాణి
మండలం లోని కాగిత గ్రామం లో రాజీవ్ పల్లి బాట రోడ్డు వై జంక్షన్ వద్ద సర్పంచ్ పోతం శెట్టి రాజేష్ ఆధ్వర్యంలో నూతనం గా ఏర్పాటు చేసిన నేతాజీ హరితవనం(పార్క్ ) గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీవో బీ చైతన్య, డిప్యూటీ ఎంపీడీవో చలపతిరావు, పరిపాలన అధికారి సీతారామరాజు పాల్గొని రిబ్బన్ కట్ చేసి పార్కును ప్రారంభించారు. సుమారు 10సెంట్లు ప్రభుత్వ భూములో పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని నిర్మాణానికి చుట్టూ ఫెన్సింగ్, హెర్త్ వర్క్ గ్రామపంచాయతీ నిధులను ఉపయోగించగా పార్కులో ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాలు సుమారు రూ 3.5 లక్షల వ్యయంతో సర్పంచ్ రాజేష్ సొంత నిధులు వెచ్చించి నేతాజీ హరితవనం పార్కును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సర్పంచ్ రాజేష్ ను అధికారులు, గ్రామస్తులందరూ అభినందించారు. ఎంపీడీవో బి చైతన్య మాట్లాడుతూ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలకు ఈ పార్కు ఆరోగ్య ప్రధానిగా నిలుస్తుందని అని పేర్కొన్నారు. ప్రతిరోజు ఈ పార్కును ఉపయోగించుకుని ఆరోగ్యవంతులు గా ఉండాలని ఆమె సూచించారు. సర్పంచ్ రాజేష్ మాట్లాడుతూ ఎప్పటినుండో గ్రామంలో పార్కు ఏర్పాటు చేయాలని సంకల్పించాలని అన్నారు. ఈ పార్కులో హరితవనంతో పాటు గ్రామస్తుల సహకారంతో బల్లలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అలాగే బుద్ధుని విగ్రహం కూడా నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి తో కలిసి అధికారులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular