నక్కపల్లి, జిల్లావాణి
శక్తివంతమైన,సoవృద్ధి గల భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా ఉండాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ భరత్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మండలంలోని చిన దొడ్డిగల్లు గ్రామంలో గురువారం విశాఖ డైరీ కళ్యాణ మండపం లో నిర్వహించిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ శిక్షణ మహా అభియాన్-2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు
ముందుగా, దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ, డా. ప్రణబ్ ముఖర్జీ, భారతమాత చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో భరత్ కుమార్ మాట్లాడుతూ, ఈనెల ఆరవ తేదీన 46వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలని, ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఆవిష్కరణ చేయాలని , కేంద్ర పథకాలపై ప్రజల్లో అవగాహన, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రధానమంత్రి నరేంద్ర, మోదీ ప్రభుత్వ పథకాలు కేంద్రాల ద్వారా అర్హులకు చేరవేయడం, జనతా వారధి ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించటం, మనసులో మాట విద్యార్థులకు మన్ కీ బాత్ ను చేరువచేసి జాతీయ చైతన్యం రాబోయే కార్యక్రమాలపై వివరించారు.
భారత దేశం భవిష్యత్తులో ప్రపంచ దేశాలలో అగ్రగామిగా మరింత అభివృద్ధి దశలో తీసుకురావాలని యోచనలో ఉన్నారని, సంక్షేమ పథకాలు ప్రజల్లో తెలియజేయాలని, ఓటు వినియోగం పై అవగాహన కల్పించారు.
ఈ సమావేశంలో బిజెపి మండల అధ్యక్షులు పోలినాటి నానాజీ, సీనియర్ నాయకులు రవి రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు కోసూరు శ్రీను, బిజెపి జిల్లా కిసాన్ మోర్చా ఎగ్జిక్యూటివ్ సభ్యులు సామాజిక సేవా కార్యకర్త జి. సన్యాసిరావు, బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఇమామ్ హుస్సేన్, బిజెపి జిల్లా కార్యదర్శి దాడిశెట్టి ఈశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకుడు ఈగల వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకుడు రవికుమార్, మహిళా మండలి ఉపాధ్యక్షురాలు నాగమణి,పార్టీ బలోపేతానికి తమ అభిప్రాయాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు కొల్నాటి అప్పారావు, బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
