జగ్గంపేట, ఏప్రిల్ 08(జిల్లా వాణి ప్రతినిధి): కాకినాడ జిల్లా జగ్గంపేట మండలానికి చెందిన ప్రముఖ సేవాకర్త, వ్యాపారవేత్త పాలచర్ల నాగేంద్రబాబు ప్రతిష్టాత్మకమైన అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యునిగా నియమితులయ్యారు. ఈ నియామకం పట్ల జుత్తుక నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేస్తూ, నాగేంద్రబాబుకు ఘనంగా అభినందనలు తెలియజేశారు. సేవాపథంలో నాగేంద్రబాబు..హోటల్ మేనేజ్మెంట్‌లో శిక్షణ పొందిన నాగేంద్రబాబు, గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట సమీపంలో “రుచి దాబా” హోటల్‌ను ఏర్పాటు చేసి వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేశారు. కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా, సామాజిక సేవలోనూ ఆయన ఎప్పుడూ ముందుంటారు. హిందూ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా భగవద్గీత గ్రంథాల పంపిణీ చేయడం. కాలినడకన వెళ్లే రామభక్తులకు, ఇతర భక్తులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పించడం. అనాధల దహన సంస్కారాలను తన స్వంత ఖర్చులతో నిర్వహిస్తూ మానవత్వానికి నిలువెత్తు రూపంగా నిలిచారు.ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు కృతజ్ఞతలు జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అడుగుజాడల్లో నడుస్తూ, పార్టీ బలోపేతానికి నాగేంద్రబాబు విశేష కృషి చేశారు. ఆయనలోని సేవా గుణాన్ని, నిబద్ధతను గుర్తించి అన్నవరం ట్రస్ట్ బోర్డ్ సభ్యునిగా అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు నాగేశ్వరరావు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

