అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డివిజన్ రోలుగుంట మండలంలోని శరభవరం, కోవ్వూరు, రత్నంపేట గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ డిపిఎం సి.హెచ్. లచ్చన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పి.ఎం.డి.ఎస్) పద్ధతిలో 30 రకాల విత్తనాలను సాగు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.
365 రోజులు పచ్చదనం – నిరంతర ఆదాయం
ఈ సందర్భంగా లచ్చన్న మాట్లాడుతూ, ఏడాది పొడవునా (365 రోజులు) భూమిని ఏదో ఒక పంటతో కప్పి ఉంచడం ద్వారా భూమిని సజీవంగా ఉంచవచ్చని తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా రైతుకు నిరంతర ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. తనుజ బయో రిసోర్స్ సెంటర్ ద్వారా విత్తనాల లభ్యత (ఇన్పుట్) మరియు దిగుబడి (అవుట్ ఫుట్) పై రైతులకు మార్గనిర్దేశం చేశారు.
పి ఎం డి ఎస్ వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు:
భూసార వృద్ధి: వివిధ రకాల పంటల వేర్లు భూమిలో వైవిధ్యాన్ని సృష్టించి, సూక్ష్మజీవులకు ఆశ్రయం కల్పిస్తాయి. ఇవి పంటలకు అవసరమైన స్థూల, సూక్ష్మ పోషకాలను అందిస్తాయి.
జల సంరక్షణ: నేల గొల్లబారి వానపాములు వృద్ధి చెందడం వల్ల, భూమిలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది.
పర్యావరణ హితం: నేలలో కార్బన్ శాతం పెరగడమే కాకుండా, జీవవైవిధ్యం మెరుగుపడుతుంది.
పెట్టుబడి తగ్గింపు: రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది, తద్వారా ప్రధాన పంటలో నాణ్యమైన దిగుబడి వస్తుంది. వాతావరణ వైపరీత్యాలను తట్టుకునే శక్తి మొక్కలకు లభిస్తుంది.
పశుగ్రాసం: నవధాన్యాల సాగు వల్ల పశువులకు పోషక విలువలతో కూడిన మేత లభిస్తుంది.
పాల్గొన్న ముఖ్యులు:
ఈ కార్యక్రమంలో మండల ఇన్‌చార్జ్ యర్రంశెట్టి నిర్మల, ఎం.టి. వరలక్ష్మి, ఐ.సి.ఆర్.పి బొబ్బిలి సాంబమూర్తి, సాంధనాడ సాయిలక్ష్మి, కేసరపూడి శివ, వ్యాచలపు రాంబాబు, గ్రామ సర్పంచ్ పంచాడ నాగ సూర్య చంద్ర, మాసాడ రాజు, రోకల రాజు, మరియు పెద్ద సంఖ్యలో మహిళా రైతులు, వి.ఏ.ఏ శివ గణేష్ పాల్గొన్నారు.
నేలను కప్పి ఉంచే 30 రకాల విత్తనాల సాగు, పిఎం డిఎస్ భూమికి రక్షణ రైతులకు లాభం.
RELATED ARTICLES
