రావికమతం ప్రాజెక్ట్ పరిధిలో గల చోడవరం సెక్టార్ నందలి వెంకయ్య గారి పేట అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార పక్షోత్సవంలో( ఏప్రిల్ 8- 23)భాగంగా తల్లులకు జంక్ ఫుడ్ తినడం వల్ల కలిగే అనర్ధాలు గురించి అలాగే పిల్లలను ఫోన్ కి దూరంగా ఉంచడానికి తల్లిదండ్రులు చేయవలసిన కార్యక్రమాల గురించి అలాగే తల్లి గర్భం దాల్చిన నాటి నుంచి పుట్టిన పిల్లవానికి ఆరు సంవత్సరాలు నిండిన వరకు తీసుకోవాల్సిన పోషకాహారం మరియు జాగ్రత్తల కోసం తల్లులకు అవగాహన కల్పించడం జరిగింది. పిల్లలలో ఆరు సంవత్సరాల లోపే వాళ్ల మెదడు అభివృద్ధి అనేది 90 శాతం జరుగుతుంది కాబట్టి ఆ సమయం చాలా కీలకమైనదని ఈ సమయంలో మంచి ఆహారం, సరైన రక్షణ, మంచి ఆరోగ్యం ఉండేలా చూసుకోవాలని సూపర్వైజర్ బి శాంతిప్రియ తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. కార్యక్రమంలో చోడవరం సెక్టార్ అంగన్వాడి టీచర్లుఅంగన్వాడీ టీచర్లు పాల్గొనడం జరిగింది.
ఘనంగా పోషణ పక్వాడ పక్షోత్సవ కార్యక్రమాలు.
RELATED ARTICLES
