చోడవరం నియోజకవర్గంలో ఘనంగా పోషణ పక్వాడా పోస్టర్ల ఆవిష్కరణచోడవరం నియోజకవర్గంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోషణ పక్వాడా పక్షోత్సవాల కార్యక్రమానికి సంబంధించిన మూడు రకాల పోస్టర్లను శాసనవర్యులు శ్రీ కె.ఎస్.ఎన్. రాజు ఘనంగా ఆవిష్కరించారు. ఈ పక్షోత్సవాలు ఏప్రిల్ 8వ తేదీ నుండి 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి.ఈ సందర్భంగా శాసనవర్యులు మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను ప్రజలు సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. గర్భిణీ దశ నుండి శిశువు జననం వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండటం అత్యంత ముఖ్యమని తెలిపారు.సిడిపిఓ వి. మంగతాయారు మాట్లాడుతూ 0 నుండి 6 సంవత్సరాల పిల్లలలో మెదడు అభివృద్ధి 90 శాతం జరుగుతుందని, ఆ వయస్సులో సరైన పోషకాహారం, సంరక్షణ ఎంతో కీలకమని వివరించారు. అలాగే పిల్లలను జంక్ ఫుడ్, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచి, తల్లిదండ్రులు మరియు ఇంటి పెద్దలు వారితో సమయం గడపాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీటీసీలు, స్థానిక రాజకీయ నాయకులు, చోడవరం సెక్టార్ సూపర్వైజర్ బి. శాంతి ప్రియ, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.
చోడవరం నియోజకవర్గంలో ఘనంగా పోషణ పక్కవాడ పోస్టర్లు ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు.
RELATED ARTICLES
