నర్సీపట్నం మండలం చెట్టు పల్లి గ్రామంలో కూటమి నాయకుల సారధ్యంలో నిర్వహించినటువంటి నర్సీపట్నం శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఇటీవల నిర్వహించిన నేత్ర వైద్య శిబిరంలో 220 మందికి కంటి వైద్య పరీక్షలు చేయడం జరిగిందని అత్యవసరమైన ఆపరేషన్ నిమిత్తం కాకినాడ శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి లో 12 మంది రోగులకు విజయవంతంగా ఆపరేషన్ చేయడం జరిగిందని రోగులను ఇంటికి చేర్చడం జరిగిందని వీరితో పాటుగా 70మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్లద్దాలు కూటమి నాయకులు చేతుల మీదుగా ఈరోజు అందించడం జరిగిందని మిగిలిన రోగులకు ఉచితంగా మందులు అందజేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు తెలియజేశారు నర్సీపట్నం శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారు చేస్తున్నటువంటి కంటి వైద్య సేవలు అభినందనీయమని ఈ కార్యక్రమము సమన్వయపరిచినటువంటి బొల్లాప్రగడ ధనలక్ష్మి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన ఉపాధ్యక్షుడు ఊడి చక్రవర్తి, తాజా మాజీ సర్పంచ్ గజాల నాగరత్నం సూరిబాబు, నర్సీపట్నం మండల వైస్ ఎంపీపీ రత్నం రమణ, జనసేన సీనియర్ నాయకులు మోపాడ సత్య ప్రసాద్, ఎర్ర ఈశ్వరరావు, టిడిపి గ్రామ శాఖ అధ్యక్షుడు కలిమి సత్తిబాబు, సామల తాతీయులు, పసుపులేటి అప్పలనాయుడు, ఎలంకాయల తాతీలు, నర్సీపట్నం శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి సిబ్బంది , ఎర్రం శెట్టి పాపారావు పాల్గొన్నారు.
చెట్టుపల్లి లో నేత్ర సంబంధిత రోగులకు ఉచిత కళ్లద్దాలు పంపిణీ.
RELATED ARTICLES
