Thursday, April 16, 2026
HomeAndhra Pradeshఎమ్మెల్యే దంపతుల ప్రత్యేక సహకారంతో ఘనంగా మన్యంలో ఆంజనేయ స్వామి విగ్రహప్రతిష్ట కార్యక్రమం

ఎమ్మెల్యే దంపతుల ప్రత్యేక సహకారంతో ఘనంగా మన్యంలో ఆంజనేయ స్వామి విగ్రహప్రతిష్ట కార్యక్రమం

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రాజవొమ్మంగి మండలం చికిలింత పంచాయితీ పెదగర్రంగి గ్రామంలో ఆదివారం శ్రీశ్రీశ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. విగ్రహాన్ని రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి, ఆమె భర్త నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు మఠం విజయ భాస్కర్ దంపతులు ఏర్పాటు చేయించారు. అన్నసమారాధనను గోకవరం బిజెపి నాయకులు, విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఏర్పాటు చేశారు. విగ్రహ ప్రతిష్ట పూజలను గిరిజన అర్చకులు కోసూరి సుబ్రమణ్యం, కాకర అర్జునరావు పూజాలను చేశారు. అనంతరం హోమం జరిగింది. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి గోకవరం బీజేపీ నాయకులు సుధారాణి, బృందం వచ్చారు.. పూలమాలలు వేసి సుధారాణి బృందాన్ని ఆహ్వానించారు.రామ నామ స్మరణతో భజనలను నిర్వహించారు. అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో బారీగా భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈకార్యక్రమంలో బిజెపి నాయకులు సుధారాణి, మండల బీజేపీ అధ్యక్షులు లొసుల రాజబాబు, పెద్దలు కాకర శంకురమయ్య, మాజీ సర్పంచ్ కోండ్ల సూరిబాబు, కొచ్చా రాంబాబు, చలుమర్తి విశ్వనాధ్ రెడ్డి, బీమిరెడ్డి సత్తిబాబు, జనుమూరి రాజబాబు, కొచ్చా లోకేష్, జనుమూరి చిన్నబ్బాయి మాస్టారు, గిరిజన అర్చకులు కోసూరి సుబ్రమణ్యం, కాకర అర్జునరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular