Saturday, April 18, 2026
HomeUncategorizedబడి పిలుస్తోంది కార్యక్రమం ప్రభుత్వ పాఠశాల ప్రాముఖ్యతపై అవగాహన ర్యాలీ.

బడి పిలుస్తోంది కార్యక్రమం ప్రభుత్వ పాఠశాల ప్రాముఖ్యతపై అవగాహన ర్యాలీ.

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని కుశర్లపూడి జెడ్పీహెచ్‌ఎస్) పాఠశాలలో ఈ రోజు“బడి పిలుస్తోంది” కార్యక్రమాన్ని ప్రధాన ఉపాధ్యాయులు శెట్టి మోహనరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడానికి విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో విద్యార్థులతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, శెట్టి మోహనరావు తోటి సిబ్బంది తోపాటు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ మరియు సభ్యులు పాల్గొన్నారు. గ్రామంలో ప్రధాన వీధుల మీదుగా సాగిన ఈ ర్యాలీలో“ప్రభుత్వ బడిలో చేరండి మంచి విద్య పొందండి. వంటి నినాదాలతో ప్రజలను ఆకట్టుకున్నారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం వంటి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని కోరారు.ఈ కార్యక్రమం ద్వారా గ్రామ ప్రజల్లో ప్రభుత్వ పాఠశాలలపై మరింత అవగాహన పెరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular