Saturday, April 18, 2026
HomeUncategorizedరోలుగుంట మండలంలో సెన్సెక్స్ ట్రైనింగ్ ద్వితీయ దశ ప్రారంభం.

రోలుగుంట మండలంలో సెన్సెక్స్ ట్రైనింగ్ ద్వితీయ దశ ప్రారంభం.

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో సెన్సస్ (జనగణన) నిర్వహణకు సంబంధించి ద్వితీయ బ్యాచ్ శిక్షణ కార్యక్రమం ఎంపీడీవో నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించబడింది.ఈ శిక్షణలో మండల పరిధిలోని ఎన్యుమరేటర్లు మరియు సూపర్వైజర్లు పాల్గొన్నారు.శిక్షణలో భాగంగా గృహాల గణన విధానం,జనాభా వివరాల సేకరణ,డేటా నమోదు ప్రక్రియ, ఆన్‌లైన్ అప్లికేషన్ వినియోగం వంటి అంశాలపై అధికారుల ద్వారా వివరణాత్మకంగా అవగాహన కల్పించారు. ఖచ్చితమైన సమాచార సేకరణ ఎంత ముఖ్యమో, ప్రతి ఇంటిని చేరుకోవడం ద్వారా నిజమైన గణాంకాలు సాధ్యమవుతాయని సూచించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, సెన్సస్ కార్యక్రమం దేశ అభివృద్ధికి కీలకమని, అందరూ బాధ్యతాయుతంగా తమ విధులను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. శిక్షణలో పాల్గొన్న సిబ్బంది సందేహాలను నివృత్తి చేసి, ప్రాక్టికల్ డెమోలను కూడా చూపించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నాగేశ్వరరావు తో పాటు ఆయా పంచాయతీల కార్యదర్శులు సచివాలయం సిబ్బంది మరియు మండల స్థాయి అధికారులు, సిబ్బంది మరియు సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular