అనకాపల్లి జిల్లా రోలుగుంట స్థానిక శాఖా గ్రంథాలయంలో చదవడం మాకిష్టం పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రంథాలయ అధికారి రాజబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, పాఠకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పుస్తక పఠనం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. చదువుతో జ్ఞానం పెరుగుతుందని, వ్యక్తిత్వ వికాసానికి పుస్తకాలు కీలకమని ఈ సందర్భంగా వివరించారు.గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతిరోజూ చదవడం అలవాటు చేసుకోవాలని రాజబాబు సూచించారు. ఈ కార్యక్రమం పాఠకుల్లో చదువు పట్ల ఆసక్తిని పెంపొందించడంలో సహాయపడింది. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి రాజబాబుతో పాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
రోలుగుంట శాఖ గ్రంథాలయంలో చదవడం మాకిష్టం కార్యక్రమ నిర్వహణ.
RELATED ARTICLES
