Monday, April 20, 2026
HomeUncategorizedరోలుగుంట కేజీబీవీ విద్యార్థుల ఘనవిజయం ఇంటర్ ఫలితాల్లో ప్రభంజనం.

రోలుగుంట కేజీబీవీ విద్యార్థుల ఘనవిజయం ఇంటర్ ఫలితాల్లో ప్రభంజనం.

అనకాపల్లి జిల్లా మండల కేంద్రమైన.రోలుగుంట కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి, తమ విద్యాసంస్థ పేరును మరోసారి మారుమోగించారు. మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ విభాగంలో విద్యార్థినులు అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించారు.ప్రథమ సంవత్సరంలో మొత్తం 44 మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరుకాగా, వారిలో 42 మంది విజయవంతంగా ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇయర్ 96%టాపర్: 500 మార్కులకు గాను 486 మార్కులు సాధించిన విద్యార్థిని జె పవిత్ర ప్రథమ స్థానంలో నిలిచింది.రెండవ సంవత్సరం ద్వితీయ సంవత్సరంలో విద్యార్థినులు 100% ఉత్తీర్ణతతో సరికొత్త రికార్డు సృష్టించారు. పరీక్ష రాసిన 33 మంది విద్యార్థినులూ విజయం సాధించారు. సెకండ్ ఇయర్ 100% టాపర్: 1000 మార్కులకు గాను 964 మార్కులతో అత్యుత్తమ స్థానాన్ని సాధించిన కె సౌజన్య టాపర్గా నిలిచింది.ఈ సందర్భంగా కస్తూరిబా ప్రిన్సిపల్ నెక్కల వెంకట తులసి మాట్లాడుతూ పాఠశాల ప్రత్యేకత ఉపాధ్యాయుల కట్టిన శ్రమ విద్యార్థుల పట్టుదల కలిస్తేనే సక్సెస్ వస్తుందంటూ క్రమశిక్షణతో కూడిన చదువు ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని మా విద్యార్థుల కృషివల్లే రికార్డులకు మా సొంతమయ్యాయని ఆమె అన్నారు.క్రమశిక్షణతో కూడిన చదువు ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని ఆమె పేర్కొన్నారు.ఇంతటి గొప్ప ఫలితాలు సాధించిన విద్యార్థినులను వారి తల్లిదండ్రులను మరియు కస్తూరిబా సిబ్బందిని ఆమె అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular