Monday, April 20, 2026
HomeAndhra Pradeshవిద్యార్థులు కనబర్చిన ప్రతిభకు ఉపాధ్యాయుల అభినందనలు

విద్యార్థులు కనబర్చిన ప్రతిభకు ఉపాధ్యాయుల అభినందనలు

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇటీవలే సాంఘిక సంక్షేమశాఖ నేతృత్వంలో 2026-27కు సంబంధించి ఐఐటీ, ఇంటర్ స్టేట్ ఎంట్రన్స్ పరీక్షాలలో పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ పరిధిలోని ముసురుమిల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబర్చారు. ముసురుమిల్లి పాఠశాల నుండి తొమ్మిది మంది విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు వారు రాయగా వీరిలో నలుగురు విద్యార్థులు ప్రతిభ చాటి ఇంటర్ కళాశాలల్లో ఎంపికయ్యారని స్థానిక ప్రధానోపాధ్యాయుడు మామిడి బాలరాజు తెలియజేశారు. ఎంపికైన శిరసం మణికంఠ, కుంజం గౌతమ్ శంకర్, ఉర్లవర ఫణి, సమంగి సతీష్ లకు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. ఇదే క్రమంలో ఐటిడిఎ పీవో స్మారన్ రాజ్, డిప్యూటీ డైక్టర్ రుక్మానందయ్య ప్రత్యేక అభినందనలు చెప్పారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెచ్ఎం అబ్బాయి రెడ్డి ఉపాధ్యాయులు సోదే ఆదివిష్ణు దొర, ఎన్వివి సత్యనారాయణ, సంజీవ్ రెడ్డి, చిన్నారెడ్డి, బాలు, బాపన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular