
పోలవరం జిల్లావాణి ప్రతినిధి: మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన సంక్షేమ శాఖ బాలురు ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అల్పాహారం, భోజనం తిన్న తర్వాత వాంతులు, విరోచనాలు,కడుపు నొప్పులు వచ్చిన వారికి వెంటనే స్పందించి హుటాహుటిన రంపచోడవరం ఏరియా ఆసుపత్రి కి ,మారేడుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రభుత్వ వైద్యాధికారులతో ప్రత్యేక వైద్యం అందించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జి డైరెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. సోమవారం మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన సంక్షేమ శాఖ బాలురు ఆశ్రమ పాఠశాలను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ ఆకస్మికంగా పర్యటించి పరిశీలించారు. ముందుగా వాంతులు, విరోచనాలు,కడుపు నొప్పితో ఆసుపత్రిలో జాయిన్ చేసిన విద్యార్థులను మెరుగైన వైద్య సేవలు తీసుకొని తిరిగి ఆశ్రమ పాఠశాలకు వచ్చిన విద్యార్థులను ఆరోగ్యం ఏవిధంగా ఉన్నది అదేవిధంగా ఎవరికైనా విరోచనాలు, కడుపునొప్పి, వాంతుల సమస్యలు ఉన్నది లేనిది ఆశ్రమ పాఠశాల డార్మెంటుకి వెళ్లి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎవరు భయపడవద్దని వాంతులు, విరోచనాలు, కడుపునొప్పి ఎవరికైనా ఉన్న ఎడల ఈ ఆశ్రమ పాఠశాలలో ప్రభుత్వం ద్వారా ప్రత్యేకమైన మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. విద్యార్థులు రాత్రులు నిద్రపోయే రూములను డైరెక్టర్ వారు, ప్రాజెక్ట్ అధికారి వారు పరిశీలించడం జరిగింది. అదేవిధంగా వంటసాలను, స్టోర్ రూమును డెరెక్టర్ వారు,జాయింట్ కలెక్టర్ వారు పరిశీలించారు.వాంతులు విరోచనాలు,కడుపు నొప్పులు విద్యార్థులకు ఎందుకు రావడం జరిగింది అదేవిధంగా సంఘటన జరిగిన శనివారం రోజున ఇడ్లీ, బొంబాయి చెట్నీ ఏ విధంగా తయారు చేసింది ఆయన ఆరా తీశారు. స్టోర్ రూమ్ లో ఏమైనా కాలం చెల్లిన నిత్యవసర వస్తువులు ఉన్నది లేనిది అదేవిధంగా కూరగాయలు, పాలు గుడ్లు, నిత్యవసర వస్తువులు వెండర్లు ప్రతినెల ఏ విధముగా సరఫరా చేయుచున్నది ఆయన ఆరా తీశారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం మెనూ పక్కగా అమలు చేయాలని, విద్యార్థులు చేతులు కడుక్కొనే టాప్స్ దగ్గర బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రతిరోజు విద్యార్థులకు కాచి చల్లార్చిన నీళ్లు అందజేయాలని ఆయన ఆదేశించారు. ప్రతిరోజు విద్యార్థులకు ఎప్పటికప్పుడు తయారుచేసిన ఆహార పదార్థాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందజేయాలని ఆయన అన్నారు. ఈ ఆశ్రమ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నది ఎంతమంది విద్యార్థులకు వాంతులు విరోచనాలు, కడుపు నొప్పులు వచ్చినది ఆయన ఆరా తీశారు. ఈ ఆశ్రమ పాఠశాలలో చదువుచున్న విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో బయటికి పంపవదని అదేవిధంగా బయట ఆహార పదార్థాలు తీసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు.ఈ పాఠశాలలో ఎన్ని ఆర్వో ప్లాంట్లు ఉన్నవి అదేవిధంగా ప్రతిరోజు విద్యార్థులకు ఎటువంటి తాగునీరు అందజేయుచున్నది ఆయన ఆరా తీశారు. విద్యార్థులకు సంబంధించిన మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించాలని అదేవిధంగా రన్నింగ్ వాటర్, పాఠశాల వెనక భాగాన ప్రహరి గోడ ఏర్పాటు చేయాలని డైరెక్టర్ వారి దృష్టికి కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు తీసుకురావడం జరిగింది వెంటనే డైరెక్టర్ వారు స్పందించి మరుగుదొడ్లు మరమ్మతులు, రన్నింగ్ వాటర్, ప్రహరీ గోడ ఏర్పాటు చేయుటకు తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. మెనూ అమలుకు సంబంధించిన పట్టికను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. విద్యార్థులతో డైరెక్టర్ వారు జాయింట్ కలెక్టర్ వారు విద్యార్థులతో కలిసి భోజనాలు చేయడం జరిగింది. అనంతరం రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో కడుపునొప్పి,విరోచనాలు, వాంతులతో బాధపడుతు విద్యార్థులను ఆస్పత్రిలో జాయిన్ అయిన విద్యార్థులను డైరెక్టర్ వారు, జాయింట్ కలెక్టర్ వారు పరామర్శించి ఏ విధంగా వైద్య సేవలు అందుచున్నది. అదేవిధంగా ఇంక ఎవరికైనా వాంతులు, విరోచనాలు, కడుపునొప్పి ఉన్నది లేనిది ఆరా తీశారు. ప్రస్తుతం ఎంతమంది విద్యార్థులు వైద్యం పొందుతున్నది అదేవిధంగా ఎంతమంది విద్యార్థులను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసినది ఆయన ఆరా తీశారు. ఈ విద్యార్థులకు ప్రతిరోజు ఆసుపత్రిలో ఏ ఆహారము అందజేయుచున్నది ఆయన ఆరా తీశారు. ప్రతి విద్యార్థికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆయన ఆదేశించారు. విద్యార్థులందరికీ పూర్తిస్థాయిలో కోలుకునే వరకు వైద్యాధికారులతో వైద్య సేవలు అందించండం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాండయ్య, డి ఎం అండ్ హెచ్ ఓ పి. సరిత, మాజీ ఎమ్మెల్యే యన్. ధనలక్ష్మి,ఎంపీపీ ఎస్. లలిత, వైస్ ఎంపీపీ రవికుమార్, సర్పంచ్ లోత రామారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఐ. శ్రీనివాసరావు, సిడిపిఓ,శాంతి కుమారి, డిఈ చైతన్య, సహాయక గిరిజన సంక్షేమ శాఖ అధికారి జె. శంభుడు, ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ సూర్యప్రకాశరావు, వైద్యాధికారులు రాజశేఖర్, క్రాంతి, సాంబశివరావు, పి. వి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
