పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం కిండ్ర కాలనీ చెందిన గంపా నాగరాజుకు ఉత్తరాఖండ్ లోని పంత్ నగర్ వ్యవసాయ యూనివర్సిటీలో అఖిల భారత పండ్ల తోటలు సమన్వయ వార్షిక సమావేశంలో ఉత్తమ రైతు పురస్కారంతో సోమవారం సత్కరించినట్లు నాగరాజు తెలిపారు. ఈ పురస్కారం గ్రాండ్ నైన్ అరటి సాగులో మంచి ఫలితాలు సాధించినందుకు ఈ అవార్డు లభించిందని చెప్పారు. ప్రాజెక్టు కోఆర్డినేటర్స్ డా ఘెష్, డా. ప్రకాశ్ పాటిల్ తదితరులు ఈ పురస్కారాన్ని ఆయని అందజేసి అభినందించారని తెలిపారు ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ నన్ను ప్రోత్సహించిన వైయస్సార్ ఉద్యానవనం విశ్వవిద్యాలయం, కొవ్వూరు ప్రాంతీయ ఉద్యానవనం పరిశోధన కేంద్రాలు వారికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు ఎంపిక పట్ల మండలంలోని రైతులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ఉద్యానవనం అధికారులు తదితరులు ఆయనకి అభినందనలు తెలియజేశారు.
ఉత్తమ రైతు పురస్కారం అందుకున్న గంపా నాగరాజుకు
RELATED ARTICLES
