Tuesday, April 21, 2026
HomeUncategorizedఆధ్యాత్మిక భావజాలంతోనే సామాజిక అభివృద్ధి.

ఆధ్యాత్మిక భావజాలంతోనే సామాజిక అభివృద్ధి.

కోటనుందూరు, జిల్లా వాణి ప్రతినిధి

ఆధ్యాత్మిక భావజాలంతోనే సామాజిక అభివృద్ధిని కూడా సాధించ వచ్చునని కాకినాడ జిల్లా కోటనందూరు గ్రామానికి చెందిన సినీ, టీవీ నటుడు మహర్షి రమణ అన్నారు.. ఆయనను మండలంలోని గూడెం కాలనీకి చెందిన నాగదేవత సేవా కమిటీ సభ్యులు మంగళవారం సత్కరించారు. ఈ సందర్బంగా ప్రకృతి సమతుల్యతను కాపాడటం అందరి బాధ్యతగా భావించి ముందుకి వెళ్లాలని, ఏజెన్సీ గ్రామాల్లో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ గిరినుజల్లో చైతన్యం తీసుకొస్తున్న నాగదేవతా సేవా సంఘం సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి రమణబాబు, జిల్లా పరిషత్ ఉద్యోగుల సంఘ ప్రతినిధి రీమల నాగరాజు, దుమంతి సత్యనారాయణ,అల్లూరి సీతారామరాజు గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్యామలా వరలక్ష్మి, కోటనందూరు మండల ఐక్య ఉపాధ్యాయ పరిషత్( UTF) అధ్యక్షులు దాడి గోవిందరావు, శ్రీ అల్లూరి సీతారామ రాజు సేవా కమిటీ అధ్యక్షుడు లక్కాకుల బాబ్జి,రీమల కుమారి, పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular