నక్కపల్లి, జిల్లావాణి
పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రధానమైన సమస్య త్రాగునీరు ఈ సమస్య ను పరిష్కారం చేయడంలో పాలకులు తీవ్రంగా విఫలం చెందారని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. అప్పలరాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
2015 సంవత్సరంలో ఆనాటి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, నేటి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఉద్దండపురం త్రాగునీటి ప్రౌజెక్టు కు శంఖుస్థాపన చేశారు,ఈ ప్రోజెక్ట్ పనులు ఎనబై శాతం పూర్తయింది, అనంతరం వచ్చిన ప్రభుత్వం ఈ ప్రోజెక్ట్ పనులు గురించి పట్టించుకోలేదు.దీని కారణంగా ప్రోజెక్ట్ పనులు నిలిచిపోయాయి.
గత రెండు సంవత్సరాలు క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికలు ముందు కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే ఈ ఉద్దండపురం త్రాగునీటి ప్రౌజెక్టు పూర్తి చేసి పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లో 150 గ్రామాలకు త్రాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా నేటికి ఈ ప్రోజెక్ట్ పనులు పూర్తి అవ్వలేదు , దీని కారణంగా ప్రజలు త్రాగునీరు అందక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
నియోజకవర్గం కు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర హోం మంత్రి నియోజకవర్గం లోనే సమస్యలు పరిష్కారం కాకపోవడం విడ్డూరం అన్నారు. వేసవి కాలం వచ్చేసరికే త్రాగునీరు సమస్య పై నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి అలా ప్రణాళిక లేకుండా ఇప్పుడు ప్రజలు త్రాగునీరు అందక గగ్గోలు పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం బాధాకరం.మండల పరిషత్ , గ్రామీణ త్రాగునీరు సరఫరా విభాగం అధికారులు నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రాంతంలో త్రాగునీరు అందక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు, దీనికి పూర్తి బాధ్యత అధికారులు ప్రభుత్వమే వహించాలి. వెంటనే ఉద్దండపురం త్రాగునీటి ప్రౌజెక్టు పూర్తి చేసి అన్ని గ్రామాల్లో ఇంటింటికి రక్షిత మంచినీరు అందించాలి.
మండలం లో గొడ్డిచెర్ల గ్రామంలో రక్షిత మంచినీరు లేకపోవడం చేతనే ప్రజలు డయేరియా బారిన పడ్డారు,ఇది మండల అధికారులు యొక్క వైఫల్యమే వెంటనే డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలి, ప్రజలందరికీ రక్షిత మంచినీరు అందించాలని సిపిఎం పార్టీ గా కోరుతున్నాము.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం.సత్యనారాయణ, ఎం.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్దండపురం త్రాగునీటి ప్రౌజెక్టు ను వెంటనే పూర్తి చేయాలి-సిపిఎం –
RELATED ARTICLES
