
నక్కపల్లి, జిల్లావాణి
స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలో జాతీయరహదారిపై సోమవారం ఉదయం ఘోర ప్రమాదం ప్రమాదం జరిగింది.
ఉపాధి హామీ పనులకు వెళ్తున్న ముగ్గురు మహిళా కూలీలను ఐసర్ వ్యాన్ వెనుక నుండి బలంగా డికోట్టడం తో ముగ్గురు మహిళా కూలీలకు తీవ్రగాయాలు అయ్యాయి.స్థానికులు సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని
వారిని ముందుగా నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
నక్కపల్లి వైపు నుండి అడ్డురోడ్డు వైపు నడుస్తూ వెళ్తున్న మహిళా కూలీలను
వెనక వైపు వస్తూ వారిపై వ్యాన్ దూసుకెళ్ళిందని సమాచారం రావడం తో
సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. క్షతగాత్రులు నక్కపల్లి గ్రామానికి చెందిన ఏనుగుపల్లి సత్యవతి (59) యాదగిరి చిన నూకాలమ్మ (50)బద్దా సత్యవతి (50) గా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను ముందుగా నక్కపల్లి ఆసుపత్రి కి తీసుకెళ్లగా పరిస్థితి విషమించడం తో మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కే జీ హెచ్ కి తరలిస్తుండగా
మార్గమధ్యలో బద్దా సత్యవతి (50) మృతి చెందింది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
