Friday, June 5, 2026
HomeUncategorizedరోలుగుంట మండలంలో పదవ తరగతి ఫలితాలు విడుదల ప్రభుత్వ పాఠశాలలే ముందంజు.

రోలుగుంట మండలంలో పదవ తరగతి ఫలితాలు విడుదల ప్రభుత్వ పాఠశాలలే ముందంజు.

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో 2026 మార్చి నెల ఎస్సెస్సీ (10వ తరగతి) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో మండలానికి చెందిన పలు జడ్‌పీ హై స్కూళ్లు మెరుగైన ప్రతిభను కనబరిచాయి.మండలంలోని పాఠశాలల వారీగా చూస్తే, ఎక్కువ శాతం పాఠశాలలు 90%కు పైగా ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేయడం విశేషం. కొంతమంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించి తమ పాఠశాలలకు పేరు తీసుకువచ్చారు.ప్రత్యేకంగా రోలుగుంట మండలం టాపర్గా నిలిచిన పాఠశాల జే నాయుడుపాలెం. ఈ పాఠశాలలో మండల టాపర్ గా ఎం. జగదీష్ 587. కాగా రెండవ మండల టాపర్ గా కె. జగదీశ్వరరావు 576 మార్కులు, రోలుగుంట కేజీబీవీ నుంచి మూడవ మండల టాపర్ మామిడి వర్షిని 565 మార్కులు సాధించారు.అలాగే మండలంలో ఉన్న పాఠశాలలుగా చూస్తే కుసర్లపూడి, బుచ్చంపేట, బీబీపట్నం వంటి పాఠశాలలు మంచి ఫలితాలు సాధించాయి.ప్రతి పాఠశాలలో టాపర్లు 530-550 మధ్య మార్కులు సాధించడం గమనార్హం కొన్ని పాఠశాలల్లో 10 మందికి పైగా విద్యార్థులు 500కి పైగా మార్కులు పొందారు.మొత్తంగా మండల స్థాయిలో ఉత్తీర్ణత శాతం అధికంగా ఉండటం విద్యార్థులు, ఉపాధ్యాయుల కృషిని ప్రతిబింబిస్తోంది. కొద్ది మంది మాత్రమే అనుతీర్ణులయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందిస్తూ, భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular