దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా తొలి విడత ఇళ్ల జాబితా నమోదు ప్రక్రియకు రోలుగుంట మండలంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తహశీల్దార్ వేమల శివ తెలిపారు. మే 1 నుంచి మే 31 వరకు నెల రోజుల పాటు ఈ సర్వే కొనసాగనుందని ఆయన వెల్లడించారు.మండలంలోని ప్రతి ఇంటిని గుర్తించి జాబితా చేయడానికి ప్రత్యేక బ్లాకుల వారీగా గణన నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందుకోసం 80 మంది ప్రధాన ఎన్యూమరేటర్లు, 7 మంది రిజర్వ్ సిబ్బందితో కలిపి మొత్తం 87 మందిని నియమించినట్లు వివరించారు. గణన ప్రక్రియ పర్యవేక్షణ కోసం 13 మంది సూపర్వైజర్లు, 3 మంది రిజర్వ్ సిబ్బందితో కలిపి 16 మందిని నియమించారు.జనగణన విధుల్లో పాల్గొనే సిబ్బందికి నియామక పత్రాలు, గుర్తింపు కార్డులు, లేఅవుట్ మ్యాపులు, సెన్సస్ కిట్ల పంపిణీ పూర్తయ్యిందని తెలిపారు. క్షేత్రస్థాయిలో సర్వే సమయంలో ప్రజలు సహకరించి సరైన సమాచారాన్ని అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తాహసిల్దార్ శివతో పాటు ఎంపిడిఓ నాగేశ్వరరావు,ఆర్ డబ్ల్యు జెఇ,అగ్రికల్చర్ ఏవో చిరంజీవి, తోటి సిబ్బంది సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
మే 1 నుంచి జనగణన తొలి విడత ప్రారంభం రోలుగుంటలో సర్వం సిద్ధం తహసిల్దార్ వేమల శివ.
RELATED ARTICLES
