జగ్గంపేట, మే 17:పర్యావరణ పరిరక్షణ, శారీరక దారుఢ్యం, ఇంధన పొదుపు ధ్యేయంగా కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు.. ఆయన శనివారం తన సిబ్బందితో కలిసి సైకిల్‌పై గ్రామాల్లో పర్యటించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో సైకిల్‌పై తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. స్థానికంగా తిరిగే ప్రతి ఒక్కరూ మోటార్ వాహనాలకు స్వస్తి చెప్పి సైకిల్ ఉపయోగించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో (ఎమర్జెన్సీ) మాత్రమే వాహనాలను వాడాలని, లేని పక్షంలో నిత్యం సైకిల్‌పై ప్రయాణించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని వివరించారు.”సైకిల్ తొక్కడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, పెరుగుతున్న ఇంధన ఖర్చుల నుండి ఎంతైనా డబ్బును పొదుపు చేసుకోవచ్చు. అని జగ్గంపేట ఎస్ఐ తెలిపారు. పోలీస్ ఉన్నతాధికారే స్వయంగా సిబ్బందితో కలిసి సైకిల్ పై వీధుల్లో పర్యటించడాన్ని చూసి స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చొరవతోనైనా స్థానికుల్లో మార్పు వస్తుందని, ప్రతి ఒక్కరూ సైకిల్ వాడకాన్ని అలవాటు చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.


