Friday, June 5, 2026
HomeUncategorizedఎస్.రాయవరం ఆంధ్ర జ్యోతి విలేకరి వెంకట్ ను కారుతో గుద్ది హత్యా ప్రయత్నం

ఎస్.రాయవరం ఆంధ్ర జ్యోతి విలేకరి వెంకట్ ను కారుతో గుద్ది హత్యా ప్రయత్నం

ఎస్.రాయవరం ఆంధ్ర జ్యోతి విలేకరి వెంకట్ ను కారుతో గుద్ది హత్యా ప్రయత్నం చేశారని వచ్చిన ఫిర్యాదు పై శనివారం రాత్రి ఎలమంచిలి రూరల్ పోలీస్ కార్యాలయంలో, పోలీస్ అధికారులును కలిసి మాట్లాడడం జరిగింది. నిందితుడిపై ఇప్పటికే బైండోవర్ కేసు నమోదు చేసినట్టు పోలీస్ అధికారులు చెప్పారు. ఆంధ్రజ్యోతి విలేకరి వెంకట్ కు ప్రాణహాని లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే )డిమాండ్ చేసింది. ఈ చర్చల్లో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి సిహెచ్.బి.ఎల్ స్వామి ,ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ (ఏపీ ఈఎంజేఏ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిషోర్, ఏపీ ఈఎంజేఏ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు చిట్టిబాబు, ఎలమంచిలి ప్రెస్ క్లబ్ సెక్రటరీ గంగాధర్, ఏపీఈఎంజేఏ జిల్లా జాయింట్ సెక్రెటరీ మూర్తి, ఏపీయూడబ్ల్యూ జె జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీమాన్, రమేష్ ,ఎలమంచిలి ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ సెక్రటరీ సంతోష్, పయకరావుపేట ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు ఎన్. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular