Friday, June 5, 2026
HomeUncategorizedపుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన,సిపిఎం

పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన,సిపిఎం

కమ్యూనిస్టు గాంధీ గా పేరుగాంచి దక్షిణ భారత దేశ ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా పూడిమడక పార్టీ శాఖ ఆధ్వర్యంలో సుందరయ్య చిత్రపటానికి చేపల తాతయ్య పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం అచ్చుతాపురం కన్వీనర్ ఆర్. రాము మాట్లాడుతూ భారత స్వాతంత్రం కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించారని తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది మందికి లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేశారని పార్లమెంటులో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంటుకి సైకిల్ మీద వెళ్లేవారని పిల్లలు పుడితే స్వార్థం వస్తుందని పిల్లలు లేకుండా తన జీవితాన్ని, ఆస్తిని ప్రజలకు అంకితం చేశారు నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొదుపు చర్యల పేరుతో పేదల పొట్టలు కొట్టి పెద్ద పెద్ద కార్పొరేట్లకు ప్రజల ఆస్తులను శ్రమను ధారపోస్తున్నారని వీటికి వ్యతిరేకంగా సుందరయ్య చూపినట్టి బాటలో ప్రజా పోరాటాలు ఉధృతం చేసి ప్రజలకు విద్య, ఉపాధి, వైద్యం వంటి మౌలిక సౌకర్యాలు కల్పించేలా ప్రజలను చైతన్య పరచాలని మత్స్యకారులకు ఉపాధి పోయేలా పరిశ్రమల వ్యర్ధాలు సముద్రంలో కలుస్తుండటంతో సాంప్రదాయ వృత్తులు సాగడం లేదని పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ తరులు తగ్గించాలని ,తీర ప్రాంతంలో భూములను బడా కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడాన్ని మానుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కూండ్రపు సోము నాయుడు ,వాసుపల్లి సత్తయ్య, గనగళ్ల నూకరాజు, కృష్ణ, చోడిపల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular