Friday, June 12, 2026
HomeUncategorizedగాలివాన బీభత్సం ఇల్లు ధ్వంసం విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో ప్రజల ఇక్కట్లు.

గాలివాన బీభత్సం ఇల్లు ధ్వంసం విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో ప్రజల ఇక్కట్లు.

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని కొంతలం గ్రామంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా విరుచుకుపడిన గాలివాన కారణంగా గ్రామంలో తీవ్ర నష్టం సంభవించింది.ఈ ఘటనలో గ్రామానికి చెందిన చింత రాములమ్మ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. గాలి వేగానికి ఇంటి పైకప్పు ఎగిరిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది.అదే సమయంలో గ్రామంలోని విద్యుత్ మెయిన్ లైన్స్ స్తంభాలు కూడా నేలకొరిగి కొంతలం గ్రామం మొత్తం చీకట్లో మునిగిపోయింది. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు స్థానికులు తెలిపారు.వర్షం కారణంగా రహదారులు కూడా దెబ్బతిని రాకపోకలు అంతరాయం కలిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించాలని, విద్యుత్ సరఫరాను త్వరగా పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే ప్రభుత్వం వారు స్పందించి కూలిపోయిన ఇళ్లకు పరిష్కారం చూపాలని బాధితులు వేడుకుంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular