పోలవరం జిల్లావాణి ప్రతినిధి :రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని రాజవొమ్మంగి గ్రామ పంచాయితీ ప్రత్యేక అధికారి ఆదేశాల మేరకు పంచాయతీలో సీసీ డ్రైనేజీ పూడికతీత పారిశుధ్య పనులను చేయడంలో ఎక్కడ రాజీ లేకుండా ప్రతిష్టాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు రాజవొమ్మంగి తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షులు, గొల్లపూడి పెద్ది రాజు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు గ్రామ ప్రజలు ఎదు ర్కొంటున్న పారిశుధ్య సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలనే సదుద్దేశంతో స్థానిక గొల్లపూడి పెద్దిరాజు స్వయంగా పనులను పరిశీలిస్తూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడికను తొలగించడం ద్వారా వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా, దోమలు మరి యు వ్యాధుల వ్యాప్తిని నివారించవ చ్చని ఆయన పేర్కొన్నారు. పనులు వేగంగా పూర్తయ్యేలా జెసిబి మిషన్తో మరియు గోకవరం ప్రాంతానికి చెందిన పారిశుద్ధ కార్మికులను ప్రత్యేకంగా రప్పించి పూడికతీత కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పెద్దిరాజు తెలిపారు. గ్రామాభివృద్ధి, పారి శుధ్య పరిరక్షణ, ప్రజారోగ్య సంరక్షణ విషయంలో తన వంతు బాధ్యతగా నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. గ్రా మాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతం గా తీర్చిదిద్దే లక్ష్యంతో డ్రైనేజీ పూడిక తీత పనులు మరింత విస్తృతంగా కొనసాగనున్నట్లు తెలిపారు
ఏపీఇఇసి డైరెక్టర్ పెద్దిరాజు నేతృత్వంలో ముమ్మరంగా పూడికతత పనులు
RELATED ARTICLES
