అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రత్నంపేట నుంచి ఒడ్డుపకు వెళ్లే ప్రధాన మార్గంలో భారీ గాలివాన కారణంగా చెట్లు విరిగి రోడ్డుకి అడ్డంగా పడిపోయాయి. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఈ విషయంపై సమాచారం అందుకున్న వెంటనే రత్నంపేట గ్రామానికి చెందిన జనసేన యువత చురుకుగా స్పందించింది. జనసేన యూత్ అధ్యక్షుడు పెద్దాడ నాగేష్ నాయకత్వంలో యువకులు ఘటనాస్థలికి చేరుకుని, రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. చెట్లను కట్ చేసి, మార్గాన్ని పూర్తిగా క్లియర్ చేయడంతో ప్రయాణికులకు మళ్లీ సౌకర్యంగా మారింది.ఈ కార్యక్రమంలో జనసైనికులు సిరిసిపల్లి శివ, పెద్దాడ శ్రీను, శనివాడ సోమల నాయుడు, నక్క అప్పారావు, టమాటపు సతీష్, పాతాళ వాసు, బుదిరెడ్ల మధు, అంజూరి జోగు బాబు, బోల్లం రాము తదితరులు పాల్గొన్నారు.స్థానికులు జనసేన యువత చూపిన సేవాభావాన్ని ప్రశంసించారు.
గాలివానతో రహదారి బ్లాక్. జనసేనాని యువత వెంటనే స్పందన.
RELATED ARTICLES
