జగ్గంపేట, ఫిబ్రవరి 14 (జిల్లా వాణి ప్రతినిధి): పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవాన్ల త్యాగాలను స్మరిస్తూ, జగ్గంపేటలో శ్రీ ప్రజ్ఞ విద్యా సంస్థల ఆధ్వర్యంలో అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ‘బ్లాక్ డే’ సందర్భంగా సంస్థ చైర్మన్ బండారు నాగబాబు నేతృత్వంలో విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు.
హృదయాలను కదిలించిన ర్యాలీ స్థానిక జే.వి.యర్ (JVR) కాంప్లెక్స్ వద్ద విద్యార్థులు జవాన్ల వేషధారణలో, చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని నిర్వహించిన ర్యాలీ చూపరులను ఆకట్టుకుంది. ఉగ్రదాడిలో మరణించిన 40 మంది జవాన్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం అక్కడ భారీ మానవహారం నిర్వహించి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బండారు నాగబాబు మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న జవాన్ల పట్ల ప్రతి ఒక్కరూ కృతజ్ఞతతో ఉండాలని కోరారు. ప్రాణత్యాగం చేసిన జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి దశ నుంచే పిల్లలలో దేశభక్తి భావాన్ని, బాధ్యతను పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్ తుమ్మల శ్వేత, కాలేజీ ప్రిన్సిపాల్ కె.అభి, ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ తోట నాగలక్ష్మి, ఇంచార్జీలు కొల్లా శ్రీనివాస్, పులిగ పవన్, బాలిన అరుణ దేవి, శ్రావణి మరియు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు .



