Thursday, April 16, 2026
HomeAndhra Pradeshచంద్రబాబు, పవన్ ఫొటోలను మార్ఫింగ్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు

చంద్రబాబు, పవన్ ఫొటోలను మార్ఫింగ్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లపై సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే కఠిన చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ, కొందరు వారి తీరు మార్చుకోవడం లేదు. నేతలను దుర్భాషలాడుతూ, తప్పుడు ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఇలాంటి మరో వ్యవహారం పోలీసుల దృష్టికి వచ్చింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసినట్టు రాజశేఖర్ రావు అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో, సదరు వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ పోలీసు అధికారులు మాట్లాడుతూ… సోషల్ మీడియా ద్వారా ఫొటోలను మార్ఫింగ్ చేసి, అసత్య ప్రచారం చేయడం చట్ట విరుద్ధమని చెప్పారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై ప్రత్యేక నిఘా ఉంచుతున్నామని వెల్లడించారు. ప్రముఖుల ఫొటోలను ఎడిట్ చేసి, అసభ్యకరంగా చిత్రీకరిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular