Thursday, April 16, 2026
HomeUncategorizedఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ఉచిత అన్నా క్యాంటీన్ ఘనంగా

ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ఉచిత అన్నా క్యాంటీన్ ఘనంగా

జిల్లా వాణి ప్రతినిధి: కాకినాడ జిల్లా జగ్గంపేటలో ప్రతి సోమవారం నిర్వహించే ఉచిత అన్నా క్యాంటీన్ నేడు కూడా ఘనంగా జరిగింది. స్థానిక కాకినాడ రోడ్డులోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం జరుగుతోంది. మల్లిశాల గ్రామానికి చెందిన స్వర్గీయ కంచర్ల సుందర రామ్మూర్తి, సీతారత్నం దంపతుల జ్ఞాపకార్థం, వారి కుమారులు కంచర్ల బ్రదర్స్ (వీర కుమారస్వామి, వీరభద్రరావు, శ్రీనివాసరావు) ఈ వారం అన్నదానానికి ఆర్థిక సహాయం అందించారు. సుమారు 500 మంది పేదలకు ఈరోజు భోజన సౌకర్యం కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా దాతల సహకారంతో ఈ క్యాంటీన్ నిరంతరాయంగా సాగుతోందని కొనియాడారు. త్వరలోనే గోకవరం రోడ్డులోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ వద్ద ప్రభుత్వ అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభం కానుందని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు జీను మణిబాబు, కొత్తకొండ బాబు, పైడిపాల సూరిబాబు మరియు కంచర్ల కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular