
పోలవరం జిల్లావాణి ప్రతినిధి: జడ్డంగి గ్రామ మడేరు వాగు ఒడ్డున ఏకరాతి గృహలో స్వయంభూ వెలసిన శ్రీశ్రీశ్రీ భ్రమరాంబికా మల్లిఖార్జునస్వామి ఉత్సవాల్లో జడ్డంగి గ్రామంలో జాతీయ రహదారి విద్యుత్ దీపాలు వెలుగులో సందడి మొదలయింది. మహాశివరాత్రి రోజున జడ్డంగి గ్రామ వీదులు గుండా శ్రీశ్రీశ్రీ భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి ఉత్సవ మూర్తులు తిరగడానికి ఆలయ ధర్మకర్త కొంగర బాబ్జిదొర వారి ఇంటి వద్ద రధంను రకరకాల పూలతో సిద్ధం చేస్తున్నారు. ఆలయం వద్ద భక్తులకు అడపా మల్లేశ్వరరావు భక్తులకు మినరల్ వాటర్ ను ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. జడ్డంగి పి. హెచ్. సి డా. పావని ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య శిభిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జడ్డంగి గ్రామస్తులు గణజాల తాతారావు ఆధ్వర్యంలో ఆదివారం జడ్డంగి శివాలయం వద్ద అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. జడ్డంగి గ్రామానికి చెందిన వూర వీర్రాజు భక్తులకు పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. రాజవొమ్మంగి జిసీసీ మేనేజర్ గౌరమ్మ ఆధ్వర్యంలో ఆలయం వద్ద జి. సి. సి స్టాల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయం వద్ద పోలీసు భద్రతా ఏర్పాట్లను రాజవొమ్మంగి సి. ఐ. గౌరీశంకర్, జడ్డంగి ఎస్. ఐ చినబాబు పరిశీలించారు. ద్విచక్ర వాహనాలు మాత్రమే ఆలయ ప్రారంభంలో నిలుపుదల చేయడం, మిగతా వాహనాలు వేరొక ప్రాంతంలో నిలుపుదలకు పార్కింగ్ బోర్డులు ఏర్పాట్లు చేసామని కమిటీ తెలిపారు. దర్శన ప్రాంతంలో చలువ పందిళ్ళు వేశారు. జలపాతాలు, దర్శనాలు వద్ద పోలీసులు పర్యవేక్షణ విధులకు సిబ్బందిని కేటాయించినట్లు సి. ఐ గౌరీశంకర్ తెలిపారు.
