జగ్గంపేట(జిల్లా వాణి ప్రతినిధి)
శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ కేవలం అప్పులపైనే ఆధారపడి ఉందని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) కాకినాడ జిల్లా అడ్వైజర్ మరియు జగ్గంపేట నియోజకవర్గం ఇంచార్జ్ జుత్తుక నాగేశ్వరరావు ఆరోపించారు. ఆదివారం కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలోని తన నివాసం నుండి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన చేసిన విమర్శల ముఖ్యాంశాలు:
అంకెల గారడీ. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ ‘కాకి లెక్కల’ వలె ఉందని, 3.32 లక్షల కోట్ల బడ్జెట్‌ను అంకెల గారడీతో ప్రజలను మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారని ఎద్దేవా చేశారు. రైతు, సంక్షేమ రంగాల నిర్లక్ష్యం: నిబద్ధత లేకుండా రూపొందించిన ఈ బడ్జెట్‌లో అటు రైతులకు గానీ, ఇటు జలవనరులు మరియు సంక్షేమ రంగానికి గానీ స్పష్టమైన నిధుల కేటాయింపులు ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అప్పులపైనే ఆధారపడి ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని ఆయన ఆరోపించారు. సాంఘిక సంక్షేమం విస్మరణ: ఉత్తరాంధ్రకు కేవలం 469 కోట్లు మాత్రమే కేటాయించారని, ఏ శాఖకు ఎంత కేటాయించారు. అనే నిబద్ధత లేదని మండిపడ్డారు. ముఖ్యంగా సాంఘిక సంక్షేమం అనే మాటే ఈ బడ్జెట్‌లో ఎక్కడా వినిపించకపోవడం దారుణమన్నారు. “ప్రజల యోగక్షేమాలను గాలికి వదిలేసి, అసెంబ్లీలో ఒకరిపై ఒకరు తిట్టుకోవడానికే సమయం సరిపోతోంది. స్వప్రయోజనాల కోసం కాకుండా, ప్రజల సంక్షేమం కోసం దృఢ సంకల్పంతో పనిచేయాలి.”— జుత్తుక నాగేశ్వరరావు, బీఎస్పీ నేత. చివరగా, ఇటువంటి నిష్ప్రయోజనమైన బడ్జెట్‌ను తాను ఎప్పుడూ చూడలేదని, ఇది ప్రజలను మోసం చేసే విధంగా ఉందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు

