Thursday, April 16, 2026
HomeInternationalఆదివాసీల ముద్దుబిడ్డ, కాంగ్రెస్ పార్టీ ప్రముఖ సీనియర్ నాయకురాలు టి రత్నబాయ్ అకాల మరణం

ఆదివాసీల ముద్దుబిడ్డ, కాంగ్రెస్ పార్టీ ప్రముఖ సీనియర్ నాయకురాలు టి రత్నబాయ్ అకాల మరణం

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: గిరిజనుల ముద్దుబిడ్డ , ఆదివాసీల ఆశాజ్యోతి తడపట్ల రత్న బాయ్ ఆకాల మరణం చెందారు. ఈమె రాజకీయంగా రంపచోడవరం నుండి కాంగ్రెస్ పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తు క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీకి వన్నెతెచ్చిపెట్టారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అప్పటి ఎల్లవరం నియోజకవర్గం ప్రస్తుత (రంపచోడవరం) లో మొదటగా ఎమ్మెల్యేగా, ఆంద్రప్రదేశ్ గిరిజన సహకార సంస్థ చైర్మన్ గా, రాజ్యసభ ఎంపీగా, ఎమ్మెల్సీగా ఎన్నో రాజ్యాంగ బద్ధమైన, రాజకీయ పరమైన ఉన్నత పదవులు చేపట్టిన ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి తన వంతు ప్రత్యేక మార్క్ ను వేసుకున్నారు. ఈమె సుమారు 79ఏళ్ల వృద్దాప్యం మరియు దీర్ఘకాలిక రుగ్మతలకు చికిత్స పొందుతూ ఇంటి వద్దనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటుంన్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఆమెకు ఆరోగ్యం పూర్తి స్థాయిలో క్షీణించగా స్థానిక రంప ఏరియా ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. పరిస్థితి చెయ్యిజారి పోవడంతో ఆమె మృతిచెందినట్లుగా ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించా రు. రత్నబాయ్ మృతితో ఉమ్మడి తూర్పుగోదావరిలో విషాదఛాయ లు అలుముకున్నాయి. రత్నబాయ్ భర్త సత్యనారాయ ణ కాంగ్రెస్ పార్టీకి పీసీసీ సభ్యులుగా సేవలు అందించారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular