Thursday, April 16, 2026
HomeUncategorizedఎమ్మెల్యే నెహ్రూపై ఆరోపణలు చేస్తే సహించం: టీడీపీ నేతల హెచ్చరిక

ఎమ్మెల్యే నెహ్రూపై ఆరోపణలు చేస్తే సహించం: టీడీపీ నేతల హెచ్చరిక

కిర్లంపూడి, జిల్లా వాణి ప్రతినిధి: స్థానిక ఎమ్మెల్యేజ్యోతుల నెహ్రూ, ఆయన కుమారుడు నవీన్‌లపై విమర్శలు చేసే స్థాయి పాఠంశెట్టి సూర్యచంద్రకు లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం కిర్లంపూడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
ఆధారాలు లేని ఆరోపణలు సరికాదు. నియోజకవర్గంలో రూ. 200 కోట్ల అవినీతి జరిగిందంటూ సూర్యచంద్ర చేసిన వ్యాఖ్యలను టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కేవలం రాజకీయ ఉనికి కోసమే ఇటువంటి అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. “అవినీతి జరిగిందని భావిస్తే ఆధారాలు బయట పెట్టాలి, అంతే తప్ప బురదజల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదు” అని వారు హెచ్చరించారు. గురువుపైనే విమర్శలా?…….జిల్లాలో ఒక పెద్ద నాయకుడిగా పేరున్న నెహ్రూను విమర్శించడం ద్వారా తన స్థాయిని పెంచుకోవాలని సూర్యచంద్ర చూస్తున్నారని వారు ఎద్దేవా చేశారు. ఒకప్పుడు నెహ్రూ వద్దే శిష్యరికం చేసి, నేడు ఆయనపైనే అవినీతి ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదనడం పచ్చి అబద్ధమని పేర్కొంటూ, వారు మీడియా ముందు అభివృద్ధి పనుల గణాంకాలను వివరించారు. మండలాల వారీగా నిర్మించిన సిమెంట్ రోడ్ల వివరాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిన ప్రభుత్వ ఫలాలు. మౌలిక సదుపాయాలు, పాఠశాలలు, ఆసుపత్రుల ఆధునీకరణకు వెచ్చించిన నిధులు లెక్కలు తెలిపారు. నియోజకవర్గ ప్రగతిపై చర్చకు తాము ఎప్పుడూ సిద్ధమేనని, ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని సూర్యచంద్రకు హితవు పలికారు. ఈ సమావేశంలో పలువురు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular