కోటనందూరు / జిల్లా వాణి ప్రతినిధి
కాకినాడ జిల్లా తుని అన్నవరం సహకార సంఘాల
ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు వినూత్న రీతిలో “ఒంటి కాలిపై నిలబడి” నిరసన కార్యక్రమం నిర్వహించారు.జీతభత్యాల పెంపు, ఖాళీ పోస్టుల భర్తీ, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని 2019 తర్వాత జాయిన్ అయిన వాళ్ళందరిని రెగ్యులర్ చేయాలని వయోపరిమితి 62 కు పెంచాలని ఆరోగ్య భీమా కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మెను కొనసాగిస్తున్నట్లు నాయకులు తెలిపారు.ఒంటి కాలిపై నిరసన ద్వారా తమ పరిస్థితి ఎంత కష్టమో, ఒక్క కాలి మీదనే సహకార రంగం నిలబడుతోందనే సందేశాన్ని ప్రభుత్వానికి తెలియజేశామని పేర్కొన్నారు. సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
సహకార రంగాన్ని కాపాడాలంటే ఉద్యోగుల హక్కులను గౌరవించాలనీ, ప్రభుత్వం తక్షణ చర్చలకు రావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోసహకార ఉద్యోగులు
శివ, రామనాయుడు, బాబురావు, సురేష్ ,వీరభద్రరావు, సింహాచలం ,సతీష్, సిఐటియు నాయకులు నక్కే ళ్ళ శ్రీనివాస్ ఎస్కే పద్మ నాగేశ్వరావు గొర్ల వెంకటరమణ పాల్గొన్నారు.
