Thursday, April 16, 2026
HomeAndhra Pradeshస్వతంత్ర సమరయోధుడు విప్లవ నాయకుడు అల్లూరి సీతారామరాజు నిలువ స్తూపం ప్రతిష్ట

స్వతంత్ర సమరయోధుడు విప్లవ నాయకుడు అల్లూరి సీతారామరాజు నిలువ స్తూపం ప్రతిష్ట

చింతపల్లి జిల్లావాణి ప్రతినిథి: అల్లూరి సీతారామరాజు జిల్లా త్యాగానికి నిలువెత్తు రూపం బ్రిటిష్ వాళ్ళు గుండెల్లో అగ్ని కణం మన్యం దొర అగ్గిపిడుగు ఆదివాసి గిరిజన ప్రజల హక్కుల కొరకై ఉద్యమించి ప్రాణాలు అర్పించిన మహావీరుడు ఆ నాయకుడు త్యాగానికి గుర్తుగా నిలువ స్తూపం చింతపల్లి మండలంలోని నడిబొడ్డున అల్లూరి సీతారామరాజు నిలువ స్తూపం ప్రతిష్ట మంగళవారం ఆయన అభిమానులు విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నిర్వహించబడటం విశిష్ట ఆకర్షణగా నిలిచింది. ఈకార్యక్రమానికి స్థానిక జడ్పిటిసి పోతురాజు బాలయ్య పడాల్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు మనం స్వేచ్ఛగా వైవులు పిలుచుకుంటున్నాం దీనికి ముఖ్య కారణం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తలలు వంచి స్వాతంత్ర్యాన్ని తెచ్చిన విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు అని గుర్తు చేశారు. ఆదివాసి హక్కుల కొరకై ప్రాణాలర్పించిన ఆ మహా నాయకుడు త్యాగానికి గుర్తుగా ఈరోజు చింతపల్లిలో అల్లూరి నిలువ స్తూపం నీ ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, అల్లూరి అభిమానులతో ప్రతిష్టించడం చాలా సంతోషంగా ఉందని జెడ్పిటిసి పోతురాజు బాలయ్య అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రాముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుధారాణి ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు పసుపులేటి బాలరాజుమాజీ ఎమ్మెల్యే కొటగుల్లి భాగ్యలక్ష్మి చింతపల్లి ఎంపీపీ కె అనూష దేవి స్థానిక సర్పంచ్ దురియ పుష్పలత సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు ప్రభుత్వ అధికారులు ప్రజలు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. వీరంతా అల్లూరి వీరత్వ కార్యక్రమాలను కొనియాడారు. విద్యార్థులు, స్థానికులు పాల్గొని అల్లూరి ఆదర్శాలను స్మరించుకున్నారు. ఇది అల్లూరి సీతారామరాజు స్మృతికి ఘన నివాళి అయింది. చింతపల్లి ప్రాంతం అల్లూరి మన్యం తిరుగుబాటుకు ( రంప తిరుగుబాటు) ప్రారంభ స్థానం 1922లో చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన చోటు. అందుకే ఇక్కడ విగ్రహ ప్రతిష్ట ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందని వారు ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular