Thursday, April 16, 2026
HomeUncategorizedజగ్గంపేట పంచాయితీ కి మహాప్రస్థానం వ్యాన్ అందించిన శ్రీ స్నేహ ఎంటర్ప్రైజెస్ అధినేత పాలకుర్తి సురేష్

జగ్గంపేట పంచాయితీ కి మహాప్రస్థానం వ్యాన్ అందించిన శ్రీ స్నేహ ఎంటర్ప్రైజెస్ అధినేత పాలకుర్తి సురేష్

జగ్గంపేట, (జిల్లా వాణి ప్రతినిధి) కాకినాడ జిల్లా జగ్గంపేట చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, శ్రీ స్నేహ ఎంటర్ప్రైజెస్ అధినేత పాలకుర్తి సురేష్ ఆదిలక్ష్మి దంపతులు జగ్గంపేట గ్రామపంచాయతీ వారికి సుమారు 10 లక్షల రూపాయలతో సమకూర్చిన మహాప్రస్థానం వ్యాన్ ను జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించి జగ్గంపేట గ్రామపంచాయతీ వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పాలకుర్తి సురేష్ దంపతులు ఒక పుణ్యకార్యం చేపట్టారని పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదని చివరి మజిలీ మహా ప్రస్థానానికి తీసుకువెళ్లే ఒక రథాన్ని జగ్గంపేట గ్రామపంచాయతీ కీ అందజేయడం చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టిన సురేష్ దంపతులను అభినందించారు. రాజమండ్రి గోదావరి తీరానికి తీసుకెళ్లడానికి బాగా ఉపయోగపడుతుందని అన్నారు. అనంతరం జగ్గంపేట మండల పరిషత్ వారి ఆధ్వర్యంలో స్వచ్ఛరథం ప్రారంభించారు. మండలంలోని గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ పరికిణి పనికిరాని వస్తువులను తీసుకుని పనికొచ్చే నిత్యవసర వస్తువులు అందజేసి గ్రామాల పరిశుభ్రతకు ఎంతగానో ఈ స్వచ్ఛ రథలు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్తకొండ బాబు, ఎండిఓ చంద్రశేఖర్, ఆయిల్ స్వామి, నండ్ల చిరంజీవి, మానేపల్లి బంగార్రాజు, రాయి సాయి, కోడూరి సత్యనారాయణ, ఎస్ వి ప్రసాద్, నాగిరెడ్డి సాయికృష్ణ, పంచాయతీ సెక్రెటరీ శివ, మానేపల్లి సాయి, బోండా సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular