Thursday, April 16, 2026
HomeUncategorizedఅంగన్వాడీలపై అక్రమ అరెస్టులను ఖండించండి, సిఐటియు

అంగన్వాడీలపై అక్రమ అరెస్టులను ఖండించండి, సిఐటియు

అంగన్వాడి సమస్యలపై నిన్న చలో విజయవాడ వెళ్లిన అంగన్వాడి టీచర్లు ,ఆయాలు శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిపై ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు టెంట్లు లాగి బ్యానర్లు చింపి అంగన్వాడీ టీచర్లు ,ఆయాలపై నిర్బంధం ప్రయోగించి అక్రమ అరెస్టులకు పాల్పడింది దీనిని నిరసిస్తూ ఈరోజు అచ్యుతాపురం ఎమ్మార్వో ఆఫీస్ వద్ద నుంచి ర్యాలీగా వెళ్లి నాలుగు రోడ్లు జంక్షన్ వద్ద నిరసన తెలియజేయడం జరిగింది .ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ కూండ్రపు సోము నాయుడు , అచ్చుతాపురం అంగనవాడి హెల్పర్ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి పి నారాయణమ్మ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 42 రోజులు అంగన్వాడీలు సమ్మె చేసిన సందర్భంగా స్వయంగా లోకేష్ టెంట్ దగ్గరకు వచ్చి మేము అధికారంలోకి వస్తే వేతనాలు ఇతర సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి రెండు సంవత్సరాల దగ్గర పడుతున్న నేటికీ పరిష్కరించలేదని గతంలో ఇచ్చిన హామీను వెంటనే అమలు చేసి అంగన్వాడీ టీచర్లు ఆయాలకు వేతనాల పెంచాలని మహిళలను అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని వెంటనే అరెస్టు చేసిన వారిని విడుదల చేసి మా న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ వరలక్ష్మి, ఎం కృప, జె పద్మ, ఎం అంబిక, ఆర్ సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular