Thursday, April 16, 2026
HomeUncategorizedజగ్గంపేటలో శ్రీ వారాహి సోలార్ సొల్యూషన్స్ బ్రాంచి ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, నవీన్

జగ్గంపేటలో శ్రీ వారాహి సోలార్ సొల్యూషన్స్ బ్రాంచి ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, నవీన్

జగ్గంపేట, (జిల్లా వాణి ప్రతినిధి) మార్చి 3: స్థానిక గోకవరం రోడ్డులోని వాసుదేవ నగర్ షాపింగ్ కాంప్లెక్స్ నందు శ్రీ వారాహి సోలార్ సొల్యూషన్స్ నూతన బ్రాంచి ప్రారంభోత్సవం జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమానికి మరో విశిష్ట అతిథిగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, జగ్గంపేట కోపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షురాలు జ్యోతుల మణిమ్మ హాజరయ్యారు. 10 కిలోవాట్స్ సోలార్ ఇన్సులేషన్ మొదట కొనుగోలు చేసిన జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు కందుల చిట్టిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ మాట్లాడుతూ ప్రస్తుతం పెరుగుతున్న విద్యుత్ వినియోగం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో పునరుత్పాదక ఇంధన వనరుల వాడకాన్ని పెంచే లక్ష్యంతో రాయితీలతో కూడిన సోలార్ ప్యానెల్స్ పంపిణీకి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే స్థానిక ప్రజలకు అత్యాధునిక సోలార్ సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు శ్రీ వారాహి సోలార్ సొల్యూషన్స్ ఈ నూతన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది అని అన్నారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు వెలిశెట్టి శ్రీనివాసరావు, కమ్మిల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మా ప్రియతమ నాయకులు జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గంలోని కూటమి నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular