జగ్గంపేట, (జిల్లా వాణి ప్రతినిధి) మార్చి 3: కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిశాల గ్రామ శివారు దట్టమైన అటవీ ప్రాంతంలోని ‘సింగారమ్మ చింత’లో కొలువై ఉన్న శ్రీ సింగారమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు మంగళవారం నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులుజాతర తొలిరోజైన మంగళవారం నాడు జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు వారిని ఘనంగా సత్కరించి, అమ్మవారి చిత్రపటాలను బహుకరించారు.ముమ్మరంగా జాతర ఏర్పాట్లుమార్చి 3 నుండి 7వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ జాతర కోసం ఆలయ కమిటీ సర్వం సిద్ధం చేసింది.సుందరీకరణ: ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, విద్యుత్ దీపాలతో అలంకరించారు. యువత, చిన్నపిల్లల కోసం జాయింట్ వీల్స్, రంగుల రాట్నాలు ఏర్పాటు చేశారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన క్యూలైన్లు, భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తులు తమ మొక్కులు తీర్చుకుని, కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ ఆవరణలో సహపంక్తి భోజనాలు చేసేందుకు ప్రత్యేక వసతులు కల్పించారు. జాతర ఐదు రోజులు భక్తులను అలరించేందుకు పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. కమిటీ సమన్వయంతో జాతర నిర్వహణఈ ఏడాది జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఐదుగురు కమిటీ ప్రెసిడెంట్లను నియమించారు. ముండ్రు కృష్ణారావు (ఎర్రబాబు), పైడిపాల సూరిబాబు, పాలికిరెడ్డి సత్యనారాయణ, నక్కరాజు వీరబాబు, కుప్పల నాగు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. అందరి సహకారంతో జాతరను దిగ్విజయం చేస్తామని వారు పేర్కొన్నారు.మల్లిశాల గ్రామస్తుల సహకారంతో ప్రారంభమైన ఈ జాతరకు భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ కోరింది.

