Friday, June 5, 2026
HomeAndhra Pradeshసామాజిక సేవ దృక్పథంతో చలివేంద్రం ఏర్పాటు సొసైటీ చైర్మన్: ముప్పన కేశవ్

సామాజిక సేవ దృక్పథంతో చలివేంద్రం ఏర్పాటు సొసైటీ చైర్మన్: ముప్పన కేశవ్

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: మండుటెంల ప్రభావంతో ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులను చూసి రాజవొమ్మంగి మండల పీఏసీఎస్ చైర్మన్ ముప్పన కేశవ్ వారికి కాస్త ఉపశమనం కలిగించాలనే సదుద్దేశంతో చలివేంద్రాన్ని రాజవొమ్మంగి మండల ప్రధాన కేంద్రంలో స్థానిక సొసైటీ కార్యాలయం ఆవరణ ప్రాంగణంలో ప్రారంభించారు. నిత్యం రద్దీగా ఉండే హైవే ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం ద్వా రా ప్రయాణికులు, బాటసారులు, వాహనదారులకు చల్లని మజ్జిగ పంపిణీ చేసి ఉపశమనం చేయవచ్చని ముప్పన కేశవ్ అన్నారు. ప్రజలకు మజ్జిగ అందజేస్తూ వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజాసేవే లక్ష్యంగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత కొద్ది రోజులుగా మండుతున్న ఎండల కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యాలు ఎదు ర్కొంటున్నా నేపథ్యంలో సామాజిక సేవ దృక్పథంతో చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు చైర్మన్ కేశవ్ పేర్కొన్నారు. ఎండల తీవ్రత తగ్గేంత వరకు చలివేంద్రం నిరంతరంగా కొనసా గుతుందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు చలివేంద్రం ఏర్పాటు చేయడాన్ని అభినందిస్తూ, మండుటెండల్లో దాహార్తితో ఇబ్బందులు పడుతున్న వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభి ప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ లోతా లక్ష్మణరావు, చీడిపల్లి అప్పారావు, పెదిరెడ్ల సత్యనారాయణ, చెక్కా లోవరాజు, షేక్ బాజ్జీ, బివిఎస్ఎన్ గుప్తా, సుంకర ప్రసాద్, సొసైటీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular