Friday, June 5, 2026
HomeAndhra Pradeshఐసిడిఎస్ సిడిపిఓ సుజాత అకాల మరణం తీరని లోటు

ఐసిడిఎస్ సిడిపిఓ సుజాత అకాల మరణం తీరని లోటు

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రాజువొమ్మంగి ఐసిడిఎస్ సిడిపిఓ సుజాత ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో శనివారం అంగన్వాడీలు సుజాత మృతికి ఘన నివాళులర్పించారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద అంగన్వాడి యూనియన్ ప్రాజెక్టు సమావేశం యూనియన్ జిల్లా నాయకురాలు కె వెంకటలక్ష్మి అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో తొలిత సిడిపిఓ సుజాత చిత్రపటానికి అంగన్వాడీలు సిఐటియు నాయకులు పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా అంగన్వాడి యూనియన్ జిల్లా నాయకురాలు కె వెంకటలక్ష్మి,మండల అధ్యక్షురాలు సిహెచ్ కుమారి,సిఐటియు నాయకులు రామరాజు తదితరులు మాట్లాడుతూ. మంచి వ్యక్తిగా పేరుపొందిన సిడిపిఓ అకాల మరణం ప్రాజెక్టుకు తీవ్ర లోటు అని అన్నారు.విధి నిర్వహణలో ఎంతో నిబద్ధతతో పని చేసే వారిని ఐసిడిఎస్ యూనియన్ నాయకులు వేధింపులతో సిడిపిఓ సుజాత ఆత్మహత్య చేసుకున్నారని ఈ నేపథ్యంలో సిడిపిఓ మృతికి కారకులైన వారిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సుందరమ్మ రమణి సత్యవతి వీర యమ్మ రాజేశ్వరి సత్యవతి రత్నం పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular