

ప
పామ్ ఆయిల్ రైతులను పతాంజలి కంపెనీ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రతి 15 రోజులకు కొన్ని పంటలో కోతల విధిస్తూ రైతులను కన్నీరు పెట్టిస్తుంది. గురువారం చోద్యం, ఏటి గైరంపేట వద్ద కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీసుకొచ్చిన పంటను కంపెనీ సిబ్బంది తిరిగి ఇళ్లకు పంపించారు. గతంలో ఎప్పుడు జరగని విధంగా పంటను కొనుగోలు చేయకపోవడంపై రైతులు ఆందోళనకు దిగారు. లేత గెలలు అధికంగా ఉన్నాయని తూకం అనంతరం వారికి అనుకూలంగా ఉన్న గెలలు మాత్రమే లారీలో లోడ్ చేస్తున్నారు. మిగిలినవి తీసుకోమంటూ తెగేసి చెప్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా కంపెనీ వ్యవహరించడంపై రైతులు ఆగ్రహం చెంది నిరసన చేపట్టారు. పతాంజలి కంపెనీ ప్రైవేట్ కాటాలను ఏర్పాటు చేసుకొని ప్రతి 15 రోజులకు రైతుల నుండి పామాయిల్ గెలలను కొనుగోలు చేస్తూ వస్తుంది. . ఇప్పటివరకు ఒకటి రెండు గెలలు తప్ప కోసుకొచ్చిన పంటను మొత్తం రవాణా చేసుకుటుంది. ఈ పరిణామంతో తమ గోడును చెప్పుకునేందుకు అటు కంపెనీ సిబ్బంది అయితే పట్టించుకునే తీరేలేదు. హార్టికల్చర్ అధికారులు పరిశీలిచి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా రైతులను ఇబ్బంది పెట్టడం తగదని అధికారులు కంపెనీ ప్రతినిధులు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. పతాంజలి కంపెనీ ప్రతినిధిగా ఉన్న శివ అనే వ్యక్తి రైతులు తీసుకొచ్చిన పంటను పుచ్చకాయలుగా పోల్చడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. హార్టికల్చర్ అధికారి శిరీషను ఈ సంఘటనపై వివరణ కోరగా ఏటి గైరంపేట, చోద్యం రెండు కొనుగోలు కేంద్రాల ద్వారా తలెత్తిన సమస్యను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి వివరిస్తానని అన్నారు. రెండు మండల
