జగ్గంపేట, (జిల్లా వాణి ప్రతినిధి) మార్చి 9: స్థానిక కాకినాడ రోడ్డులోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత ఐదేళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతున్న ఉచిత అన్నా క్యాంటీన్‌కు దాతలు అండగా నిలిచారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్యాంటీన్‌కు, ఈ వారం గోకవరం మండలానికి చెందిన యువనేతలు గల్లా రామచంద్రరావు (రాము) (భూపతిపాలెం రెసిడెన్షియల్ స్కూల్ చైర్మన్), నాగం వెంకటపతి (తంటికొండ విద్యా కమిటీ చైర్మన్) ఆర్థిక సాయం అందించారు.ప్రభుత్వ అన్నా క్యాంటీన్లు త్వరలోనే ప్రారంభంఈ వారం అన్నదాన కార్యక్రమానికి జగ్గంపేట మండల టీడీపి అధ్యక్షులు జీనుమణి బాబు ముఖ్యఅతిథిగా హాజరై పేదలకు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను రద్దు చేసినా, పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఎమ్మెల్యే నెహ్రూ, నవీన్‌లు స్వచ్ఛందంగా దీనిని నిర్వహిస్తున్నారు.త్వరలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి.ఈ వారం సుమారు 500 మందికి పైగా పేదలకు అన్నదానం నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు.పాల్గొన్న ముఖ్య నాయకులుఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దేవరపల్లి మూర్తి, టౌన్ టీడీపి అధ్యక్షులు పాండ్రంగి రాంబాబుతో పాటు పలువురు నేతలు, పిలా మహేష్, దాపర్తి సీతారామయ్య, వేములకొండ జోగారావు.వెలిశెట్టి బుజ్జి, కోడూరి రమేష్, చెలికాని హరిగోపాల్.వానశెట్టి శ్రీను, కుప్ప తాతారావు తదితరులు పాల్గొన్నారు.

