
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం సిహెచ్ నాగా పురం గ్రామంలో సుమారుగా 50 మంది రైతులకు కొయ్యూరు మండలం కొమ్మిక పంచాయితీ కితలోవ రెవెన్యూ పరిధిలో సుమారుగా 200 ఎకరాలు సాగుభూమి కలదు మీరంతా పూర్వం నుండి సాగు చేసుకోవడం జరుగుతుంది కానీ ప్రభుత్వ నుండి ఏ హక్కు పత్రము లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కావున రైతులు అంతా మాకు సాగు హక్కు కల్పించి ప్రభుత్వ రాయితీలు కల్పించాలని స్థానిక రెవెన్యూ విఆర్ఓ సోమలింగంకు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వీఆర్వో సోమలింగం మాట్లాడుతూ మీ యొక్క సమస్యను కొయ్యూరు మండల ఎమ్మార్వో కి పై అధికారులకు మీ సమస్య తెలియజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
