Thursday, April 16, 2026
HomeUncategorizedవైయస్సార్సీపి యూత్ విభాగం జనరల్ సెక్రెటరీ సిద్దు కి స్నేహితుల అభినందనలు .

వైయస్సార్సీపి యూత్ విభాగం జనరల్ సెక్రెటరీ సిద్దు కి స్నేహితుల అభినందనలు .

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బిబి పట్టణానికి చెందిన గొంది సిద్దుని అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ యూత్ విభాగం జనరల్ సెక్రటరీగా నియమించారు. ఈ అవకాశం లభించిన సందర్భంగా ఆయన క్లాస్మేట్స్ ఆనందం వ్యక్తం చేసుకుని ప్రత్యేక సత్కారం ఏర్పాటు చేశారు. దేవరపల్లి మండలం తెలుగుపూడి గురుకుల చదువుకున్న క్లాస్మేట్స్ ఈ పాఠశాలలో రోజు సమ్మిలితంగా కూడి, గొంది సిద్ధుని స్వర్గీయులైన తల్లిదండ్రుల పేరిట గురుకుల పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పుష్పగుచ్ఛాలతో సత్కరించి, హృదయపూర్వక అభినందాలు తెలిపారు. సిద్దు పార్టీలో చురుకుగా పనిచేసి, యూత్ విభాగంలో మంచి గుర్తింపు పొందాడని, ఈ నియామకం ఆయన కృషికి సమాధానమని క్లాస్మేట్స్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఎం. ప్రసాద్ కుమార్, డి. పాపారావు, నేతల రాజు, వీర్రాజు, జగదీష్ తదితరులు పాల్గొని, సిద్ధుని సాధనకు శుభాలు అందజేశారు. గొంది సిద్దు మాట్లాడుతూ, తన క్లాస్మేట్స్ స్నేహితుల మద్దతు, పార్టీ నేతల ఆశీస్సులతో మరింత కృషి చేస్తానని, జిల్లా యూత్ విభాగాన్ని బలోపేతం చేస్తానని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular