గొలుగొండ: మండలం లింగంపేట పంచాయతీ పరిధిలోని రామచంద్రపురం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు సందడి చేశారు.గ్రామస్తుల ఆహ్వానం మేరకు జనసేన నర్సీపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ రాజాన వీర సూర్య చంద్ర గ్రామాన్ని సందర్శించి కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి పలు అంశాలపై చర్చించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామస్తులు నాయకులకు ఘన స్వాగతం పలికి తమ సమస్యలను వివరించారు.
ఈ కార్యక్రమంలో గొలుగొండ మండల అధ్యక్షులు గండం దొరబాబు,నర్సీపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ సల్లదుల ప్రసాద్ బాబు దేవి,గ్రామ పార్టీ అధ్యక్షులు అబ్బానాయుడు,మరస స్వామి నాయుడు,సాయి శ్యాము తదితరులు పాల్గొన్నారు.

