Thursday, April 16, 2026
HomeUncategorizedవైసీపీ ఆరోపణలు అవాస్తవం.. కూటమి పాలనపై ప్రజల్లో విశ్వాసం: ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

వైసీపీ ఆరోపణలు అవాస్తవం.. కూటమి పాలనపై ప్రజల్లో విశ్వాసం: ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

జగ్గంపేట, మార్చి 24: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అద్భుతమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే వైకాపా నాయకులు అర్థరహితమైన ఆరోపణలు చేస్తున్నారని కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు జ్యోతుల నెహ్రూ ధ్వజమెత్తారు. మంగళవారం జగ్గంపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ​అభివృద్ధిని చూసి వైసీపీకి వణుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం పారిశ్రామికంగా దూసుకుపోతుంటే, అది తట్టుకోలేక వైసీపీ నేతలు విషప్రచారం చేస్తున్నారని నెహ్రూ మండిపడ్డారు. ముఖ్యంగా నక్కపల్లి స్టీల్ ప్లాంట్‌పై ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. కేవలం 18 నెలల కాలంలోనే అనుమతులు సాధించి, శంకుస్థాపన చేయడం చంద్రబాబు సమర్థతకు నిదర్శనమని, దీనివల్ల దాదాపు లక్ష మందికి ఉపాధి లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ​ఉద్యోగాల కల్పనలో రికార్డు ​గత వైసీపీ ప్రభుత్వం ‘జాబ్ క్యాలెండర్’ పేరుతో యువతను మోసం చేసిందని, పెద్ద చదువులు చదువుకున్న వారికి సచివాలయాల్లో చిన్న ఉద్యోగాలతో సరిపెట్టారని నెహ్రూ విమర్శించారు. దానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలల్లోనే భారీస్థాయిలో ఉద్యోగాల కల్పన చేసిందని ఆయన గణాంకాలతో వివరించారు. ​మెగా డీఎస్సీ & పోలీస్ 1.46 లక్షల పోస్టులు (16,000 టీచర్ పోస్టులతో కలిపి). ​పారిశ్రామిక రంగం 94,195 ఉద్యోగాలు. ​ఫుడ్ ప్రాసెసింగ్ 64,037 ఉద్యోగాలు. ​ఐటీ & ఇతర రంగాలు సుమారు 18,000 ఉద్యోగాలు. ​మొత్తం ఉపాధి ఇప్పటివరకు సుమారు 6 లక్షల మందికి ఉపాధి కల్పించగా, రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యమని ఆయన ప్రకటించారు. ​జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళిక ​నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు నెహ్రూ తెలిపారు. ​ఇండస్ట్రియల్ పార్క్ 450 ఎకరాల్లో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు. పేదల ఇళ్లుపోలవరం కాలువ గట్టున ఉన్న 845 ఎకరాల స్థలాన్ని క్లియర్ చేసి, నిరుపేదలకు 3 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తాం. ​మౌలిక సదుపాయాలు: ప్రతి 1000 కుటుంబాలకు ఒక సచివాలయం, స్కూల్, ఆసుపత్రి, ఆడిటోరియం వంటి సకల వసతులు కల్పిస్తాం. ​పారిశ్రామిక భవనాలు 10 కోట్ల రూపాయల వ్యయంతో జగ్గంపేటలో పారిశ్రామిక భవనాల నిర్మాణం. “చంద్రబాబు నాయకత్వంలో దేశంలోనే 25% పెట్టుబడులు మన రాష్ట్రానికే వస్తున్నాయి. డ్రైవర్స్ కాలనీ లబ్ధిదారులకు ఎటువంటి అన్యాయం జరగదు, వారందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తాం” అని నెహ్రూ హామీ ఇచ్చారు. ​ఈ సమావేశంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్.వి.ఎస్. అప్పలరాజు, కార్పొరేషన్ డైరెక్టర్లు పోతుల మోహనరావు, కొత్త కొండబాబు, పిల్లా చంటిబాబు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular