Thursday, April 16, 2026
HomeAndhra Pradeshనూతన కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే దంపతులు, పోలవరం జిల్లాలోని అన్ని మండలాల అభివృద్ధికి...

నూతన కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే దంపతులు, పోలవరం జిల్లాలోని అన్ని మండలాల అభివృద్ధికి తోర్పాటు అందించాలని వినతి

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: పోలవరం జిల్లా కలెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన దినేష్ కుమార్ ను రంపచోడవరం నియోజవర్గ శాసన సభ్యురాలు మరియు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిరియాల శిరీష దేవి ఆమె, భర్త తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు మఠం విజయభాస్కర్ దంపతులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ తో ఎమ్మెల్యే శిరీష దేవి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద వైశాల్యం కలిగి ఉన్న నూతన పోలవరం జిల్లాలోని ఉన్న అన్ని మండలాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో విద్యా వైద్యం మౌళిక వసతుల కల్పన ఆశ్రమ పాఠశాలలు వసతి గృహాల్లో నెలకొన్న పలు సమస్యలను కలెక్టర్ వద్ద ప్రస్తావించారు. అంతేకాకుండా ఏళ్ల తరబడి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న అనేక కీలక విషయాలను కలెక్టర్ దినేష్ కుమార్ దృష్టికి ఎమ్మెల్యే శిరీష దేవి తీసుకెళ్లారు. ఇదే కోణంలో మన్యం ప్రాంతంలో నివాసం ఉంటున్న అన్ని గిరిజన ఉప కులవారు కుల దృవీకరణ పత్రాల మంజూరు విషయంలో పలు గిరిజన తెగలువారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కలెక్టర్ కి అక్కడే ఉన్న జిల్లా సంయుక్త కలెక్టర్, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి బచ్చు స్మరణ రాజ్ లకు కూలంకుషంగా వివరించారు. శాసనసభ్యురాలు ప్రతిపాదించిన అన్ని విషయాలపై స్పందిస్తూ తక్షణమే పరిష్కార మార్గానికి తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దినేష్ కుమార్, ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవికి హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఆమె వెంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన కమిషన్ సభ్యులు గొర్లె సునీత, రంపచోడవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయ్ భాస్కర్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు స్వప్న కుమారి అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు అడబాల బాపిరాజు
తదితరులు పాల్గొన్నారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular