పోలవరం జిల్లావాణి ప్రతినిధి : అంగన్వాడీ వర్కర్స్, అండ్ హెల్ఫేర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం స్థానిక ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆఫీస్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు,హెల్పర్లు,మినీ వర్కర్లు ఆందోళన చేపట్టారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ పోలవరం జిల్లా సహాయకార్యదర్శి పి.రామరాజు,అంగన్వాడీ యూనియన్ నాయకురాలు కె వెంకట లక్ష్మీ,సీహెచ్ కుమారి తదితరులు మాట్లాడుతూ. అంగన్వాడీలకు కనీస వేతనం 26,వేలు ఇవ్వాలని,ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అంగన్వాడీ కార్మికులకు వేసవి సెలవులు ప్రభుత్వం ప్రకటన చెయ్యాలని, మార్చి 2,వ తారీఖున చలో విజయవాడ ధర్నా కి ఒకరోజు వేతనం కట్ చెయ్యాల్సి ఉండగా 3,వ తారీకు హోలీ రోజు కూడా వేతనం కట్ చేయటం దుర్మార్గమని 3,వ తారీకు వేతనాన్ని వెంటనే కార్మికుల అకౌంట్ లో జమ చెయ్యాలని సీఐటీయూ గా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇతర సమస్యల పరిష్కారానికి యూనియన్ పిలుపులకు అంగన్వాడీ కార్మికులు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని స్థానిక సిడిపిఓ సుజాతకు అందజేశారు.ఈ కార్యక్రమం లో అంగన్వాడీ యూనియన్ నాయకులు సత్యవతి, రత్నం,రమణి,మంగ పెద్ద సంఖ్యలో అంగన్వాడీ లు పాల్గొన్నారు..
అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం ఇచ్చి, వారి సమస్యలు పరిష్కరించాలి సిఐటియు డిమాండ్
RELATED ARTICLES
